ములుగు జిల్లా నామకరణంపై..
నేడు గ్రామ సభలు..అధికారులకు ప్రభుత్వ ఆదేశాలు
ములుగు`జనత న్యూస్
ములుగును వన దేవతలైన సమ్మక్క`సారళమ్మ జిల్లాగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత నెల 6న రాజపత్రం విడుదల చేసిన సర్కారు..నేడు ఈ జిల్లాల్లో గ్రామ సభల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ములుగు జిల్లాలోని మండల పరిషత్ ఆఫీసుల్లో నోటీసులు అంటించారు. దీంతో బుధవారం ఆయా పంచాయతీల్లో అధికారులు గ్రామ సభలు పెట్టి అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించనున్నారు. అభ్యంతరాలుంటే లిఖిత పూర్వకంగా అధికారులకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ప్రజలను కోరారు. గ్రామ సభలను సక్సెస్ చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించిన అనంతరం పలు అంశాలను పరిశీలనలోకి తీసుకుని సమ్మక్క`సారళమ్మ జిల్లాగా పేరు మార్చే అవకాశాలున్నాయి. ములుగు నుండి రాష్ట్ర మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తుండగా, సమ్మక్క సారలమ్మ వన దేవతలు సీఎం రేవంత్ రెడ్డికి సెంటిమెంట్ కావడంతో తొలుత ఈ జిల్లాకు పేరు మార్చే చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది.
ఇక సమ్మక్క సారళమ్మ జిల్లా !
- Advertisment -