ED Rides :దేశవ్యాప్తంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు విస్తృతంగా నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ఇళ్లపై అధికారులు ఆకస్మికంగా రైడ్ చేస్తున్నారు. తాజాగా వక్బ్ బోర్డులో చైర్మన్ గా వ్యవహరిస్తున్న అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీలో సోదాలు చేస్తోంది మంగళవారం ఉదయం ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. వక్బ్ బోర్డులో అక్రమాలు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యలంలో ఉదయం నుంచే ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏసీబి, సీబీఐ ఆయనపై రెండ్ ఎఫ్ఐఆర్ లు దాఖలు చేశాయి. చట్ట వ్యతిరేకంగా 32 మందిని వక్ఫ్ బోర్డులో నియమించారని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. కాగా అమానతుల్లా ఖాన్ పార్టీలో కొనసాగుతున్నారు. కొద్ది రోజుల కిందట ఈ పార్టీకి చెందిన ఎంపీ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీ చేసిన విషయం తెలిసిందే. దీంతో కావాలనేతమ ఇళ్లల్లో ఈడీ తనిఖీలు నిర్వహిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ED Rides : మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు..
- Advertisment -