ఢిల్లీలో గంగుల పొర్లు దండాలు
కమలాకర్‌ది భూకబ్జాలు చేసిన సంస్కృతి ..?
ప్రజలను ఆదుకునే సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వానిది
కాడ్రా వస్తుంది జాగ్రత్త బిడ్డ..!
కరీంనగర్-జనత న్యూస్
గ్రానైట్ సంస్థకు సంబంధించిన పన్నులు ఎగవేసిన ఈడీ కేసు నుంచి బయటపడేందుకే మాజీ మంత్రి గంగుల కమలాకర్ బీజేపీతో చెట్టపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఇందు కోసం వారానికోసారి ఢల్లీికి వెళ్తున్నారని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్ద పొర్లు దండాలు పెడుతున్నారని ఆరోపించారు. వర్షాలతో కరీంనగర్ ప్రజలు అవస్థలు పడుతుంటే అవేం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని గంగులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు వెలిచాల ఖండిరచారు. కరీంనగర్ లో వరదలు ముంచెత్తుతుంటే ఎమ్మెల్యే గంగుల ఎక్కడో సేద తీరుతూ సరదాగా గడుపుతుండడంపై ప్రజలే అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. బాధితులకు అండగా ఉండాల్సిన తరుణంలో ఎమ్మెల్యే అడ్రస్ లేకుండా పోవడం నీచ సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై అవాకులు చవాకులు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. భూ కబ్జాలకు కారణమైన బీఆర్‌ఎస్ నేతలపై ఖమ్మంలో కడుపు మండిన బాధితులు దాడి చేస్తే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం తగదని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఖమ్మం తోపాటు ఆయా జిల్లాల్లో ఎక్కడికక్కడ వరద బాధితులను కలుస్తూ ఆదుకుంటుంటే, ఇవేమీ చూడకుండా బీఆర్‌ఎస్ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. గత పదేళ్ల కెసిఆర్ పాలనలో వర్షాలు, వరదలు వచ్చినా ఏనాడు ప్రజలను పరామర్శించలేదని, సొంత నియోజకవర్గంలో మరణాలు సంభవించిన ఫామ్ హౌస్ దాటలేదని ధ్వజమెత్తారు. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ, అతని అనుచరులు చెరువులు, కుంటలు, నాళాలు, బఫర్ జోన్ స్థలాలను ఆక్రమించడం వల్లే వరదలు ముంచేస్తాయని ఆరోపించారు. వీరు చేసిన పాపాలకు ఖమ్మం ప్రజలు తగిన శాస్తి చెప్పారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై గంగుల కమలాకర్ విషం ప్రచారం చేయడం సరైనది కాదని, బీఆర్‌ఎస్ పాలనలో భూ కబ్జాలు చేసిన నీచ సంస్కృతి మీది కాదా అని ప్రశ్నించారు. గంగుల అనుచరులకు ఇప్పటికే తగిన శాస్తి జరిగిందని, రాబోయే రోజుల్లో మరిన్ని పాపాలు బయటపడడం ఖాయమని ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో హైడ్రా తరహాలో వ్యవస్థ త్వరలో రాబోతుందని.. కబ్జా దారుల బరతం పడుతుందని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత విడుదల సందర్భంగా ఢల్లీిలోని తీహార్ జైలు ముందు తీన్మార్ డాన్స్ లు చేసిన నీచ సంస్కృతి బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలదని మండిపడ్డారు. దేశంలో ఇలాంటి ఘటనలు ఏనాడు చూడలేదని, ఫోటో షూట్ కోసమే డాన్సులు చేయడం దారుణంగా ఉందని పేర్కొన్నారు. కవిత ఏం సాధించిందని తీహారు జైలు ముందు తీన్మార్ డాన్సులు చేశారని ప్రశ్నించారు.
ఈడీ కేసు మాఫీ కోసమే..

- Advertisment -