హైదరాబాద్, జనత న్యూస్: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోసారి పార్టీ మారుతున్నారా అనే ప్రచారం సాగుతుంది. తాజాగా ఆయన కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి. మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన ఈటల రాజేందర్ ఎక్కడా గెలవలేదు. ఈసారి ఆయన ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఆయన సొంత జిల్లాలో బండి సంజయ్ కే టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తారని అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన ఈటల హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరుపున గెలిచారు. అయితే ఆ తరువాత ఆయనకే చేరికల ఆహ్వాన కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. కానీ ఇతర పార్టీల నుంచి ఆయన బీజేపీలోకి తీసుకురావడంలో సక్సెస్ కాలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు బీజేపీలో కీలకంగా ఉన్న బండి సంజయ్ తో విభేదాలున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన పార్టీ మారొచ్చ అని అంటున్నారు. దీనిపై ఈటల రాజేందర్ ఎలా స్పందిస్తారోనన అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Eatala Rajender : కాంగ్రెస్ నేతలతో ‘ఈటల’ భేటీ.. పార్టీ మారుతారా?
- Advertisment -