మోసం చేస్తున్న వారిపై కేసు నమోదు..
ఇప్పటికే కేసు ఫైల్ చేసిన పోలీసులు
సిరిసిల్ల-జనత న్యూస్
దసరా, దీపావళి పేరుతో ఆఫర్లు పెట్టి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారా..? ప్రలోభాలకు గురి చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారా..? తస్మత్ జాగ్రత్త ! పోలీసులు కేసులు నమోదు చేసి కట కటాలకు పంపిస్తారు !! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొందరు దసరా పేరుతో ఇలానే ఆఫర్లు పెట్టి వినియోగ దారులను మోసం చేసేందుకు ప్రయత్నించగా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కేసులు నమోదు చేయించారు. జిల్లాలో దసరా పండుగ సందర్భంగా దసరా బంఫర్ ఆఫర్, దసర ధమాకా పేర్లతో సోషల్ మీడియాలో ‘‘100 కొట్టు మేకను పట్టు’’ అనే క్యాప్షన్ తో అమాయక ప్రజల వద్ద నుండి డబ్బులను వసూలు చేస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. వివిధ రకాల వస్తువులు, మేక, రైస్ కుక్కర్, కోళ్లు, పట్టుచీర,10 గ్రాముల వెండి నాణం, మద్యం..ఇలా బహుమతులు ఇస్తామని మోసం చేస్తున్న నిర్వహకులపై కేసులు అయ్యాయి. వేములవాడ పట్టణ పరిధిలో శ్రీకాంత్, అవునూరి ప్రశాంత్, మహేందర్, వెంకటేష్, స్వామి.. కోడిముంజ గ్రామంలో వికాస్, సాయి, అజేయ్, రమేష్, చందు కలసి దసరా బంఫర్ ఆఫర్, దసర ధమాకా పేర్లతో సోషల్ మీడియాలో ‘‘100 కొట్టు మేకను పట్టు’’ అనే క్యాప్షన్ తో ప్రకటనలు జారీ చేశారు. సోషల్ మీడియాలో సైతం వైరల్ అయింది. దీంతో జిల్లా ఎస్పీ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో.. మొత్తం 10 మందిపై కేసు నమోదు చేశారు. పండుగల సందర్భంగా ఎవరూ కూడా చీటీలు, ప్రైజ్ మనీ, బహమతులు పేర్లతో చేసే ప్రకటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా మోసపోవద్దని ఎస్పీ సూచించారు. ఇటువంటివి ప్రకటనలు ఉంటే పోలీస్ వారికి దృష్టికి తీసుకరావాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
దసరా, దీపావళి పేరుతో ఆఫర్లు పెడుతున్నారా..?

- Advertisment -