తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుక రావాలని తలచింది. ఇందులో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను నిర్మించనుంది. దసరా ముందు రోజు పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన నయూనాను విడుదల చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పాయిలెట్ ప్రాజెక్టు కింద 25 ప్రాంతాల్లో 20 నుండి 25 ఎకరాల స్థలంలో వీటిని నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు రూ. 5 వేల కోట్లను కేటాయించినట్లు స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న ఈ పాఠశాలల ద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. కాగా..వేరు వేరు శాఖలు, విభాగాల్లో కొనసాగుతున్న విద్యాలయాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనివల్ల సమన్వయం, పర్యవేక్షణ ఉంటుందనే అభిప్రాయంలో తెలంగాణ సర్కారు ఉంది.
దసరా ముందు రోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు..

- Advertisment -