బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణాలు అందరూ చూస్తుందే. బంగ్లా పరిణామాలు, పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశంలో ఏర్పాటు చేయబోయే దుర్గా మండపాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతేడాది ఇక్కడ 33,431 ఏర్పాటు కాగా..ఈ ఈ సంవత్సరం ఆ సంఖ్య మించిపోతుందని పూజా ఉత్సవ పరిషత్ ప్రతినిధి చౌదరి ప్రకటించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. కాగా బంగ్లా ప్రభుత్వం మాత్రం ప్రత్యేకంగా అజాన్‌కు ఐదు నిమిషాల ముందు, నమాజ్ ఐదు నిమిషాల ముందు నుండి విరామం పాటించాలని గృహ వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఎండి జహంగీర్ ఆలం చౌదరి ప్రకటించారు. ఆయా వేళల్లో సౌండ్ సిస్టమ్‌లను నిలిపి వేయాలని కోరగా..ఇందుకు మండప నిర్వాహకులు సమ్మతించినట్లు తెలిపారు. కాగా..తమది మత సామరస్య దేశమని బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ ప్రకటించారు.
బంగ్లాదేశ్‌లో దుర్గా మండపాలెన్నంటే..

- Advertisment -