జనత న్యూస్ :
తెలంగాణ డీఎస్‌సీ ఫలితాలు మరింత ఆలస్యమయ్యేలా కనబడుతున్నాయి. ఈ నెల 6న విద్యాశాఖ విడుదల చేసిన ‘కీ’ పై అభ్యర్థుల నుండి భారీగా అభ్యంతరాలు వచ్చాయి. వాటిపై విద్యాశాఖ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీనికి తోడు న్యాయపరమైన చిక్కులు రాకుండా, ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. నిపుణుల కమిటీ పరిశీలించాకే ఫలితాలు ప్రకటించే ఛాన్స్ ఉంది. డీఎస్‌సీ, టెట్ మార్క్స్ కలిపి వెలువడే ర్యాంకుల వివరాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11, 062 పోస్టులకు గాను 2.45 లక్షల మంది అభ్యర్థులు డీఎస్‌సీ రాశారు. అయితే మరో డీఎస్‌సీని కూడా వేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. మరో డీఎస్‌సీని నిర్వహించి, రెండు ఒకేసారి ఫలితాలు వెలువరిస్తారా, లేదా ముందుగా నిర్వహించిన డీఎస్‌సీ ఫలితాలు ప్రకటించి నియామకాలు చేపడుతుందా అనేది వేచి చూడాలి.
డీఎస్సీ ఫలితాలెప్పుడు ?

- Advertisment -