ఇల్లంతకుంట జనతా న్యూస్: రిజర్వాయర్లలో నీరు లేక భూగర్భ జలాలు అడుగంటి పంట పొలాలు ఎండిపోతున్నాయని మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ అన్నారు. ఇల్లంతకుంట మండలంలోని పెద్ద లింగాపురం గ్రామంలో గురువారం ఎండిన పంట పొలాలను రసమయి బాలకిషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పంట పొలలాలను చూస్తే బాధనిపిస్తుదని కనీసం రైతుల పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశా రు.వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదని, బోర్లు బావుల్లో నీళ్లు లేక చివరి దశలో పంటలు ఎండిపోయి రైతులు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి నెలకొందని అన్నారు. కొందరు రైతులు కడుపు మండి పంట పొలం తగులబెట్టి నిరసన తెలిపారని, కొందరు పశువులను మేపారన్నారు. పంట చివరి దశలో ఉందని పక్షం రోజుల్లో పంట చేతికి వస్తదని ఇప్పటికైనా ఎండిపోగా మిగిలిన పంటల కైనా సరైన నీటి సౌకర్యం కల్పించాలని తెలిపారు. అప్పటి బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క ఎకరం పంట కూడా ఎండకుండా నీరు ఇచ్చామని, ఈ ప్రభుత్వంలో నీరు లేక, విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలోనే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పాలనపై అవగాహన లేక ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందించలేకపోతున్నారని విమర్శించారు. ఎద్దేడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం ముందుకు సాగవని, ఈ ప్రభుత్వానికి రైతుల గోస తగులుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంట పొలాలకు నీరందించాలని, ఎండిన పంటలను సర్వే చేయించి నష్టపరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు బారాస పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి వివిధ గ్రామాల నాయకులు రైతులు పాల్గొన్నారు. అనంతరం ఇల్లంతకుంట మండలంలోని రామాజీపేట పెద్ద లింగాపురం గ్రామంలో వివిధ కారణాల చేత మృతి చెందిన కుటుంబాలను రసమయి పరామర్శించారు.
రిజర్వాయర్లలో నీరు లేకనే ఎండిన పంట పొలాలు
- Advertisment -