-వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
వరంగల్, జనతా న్యూస్ : శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలర్చించి పోలీసు అమరవీరులను ప్రజలు మరువద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే) పురస్కరించుకోని పోలీసులు క్రోవ్వోత్తుల ర్యాలీని నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్తో పాటు పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బందితో పాటు, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గోన్నారు. అశోక జంక్షన్ నుండి వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము వరకు నిర్వహించిన ఈ ర్యాలీలోని వారు పోలీస్ కమిషనరేట్ కార్యాలయములోని అమర వీరు స్థూపం వద్ద చేరుకోని అమరవీరులకు నివాళులు అర్పించారు.
అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నక్సలైట్ల చేతుల్లో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు వృధాపోవని, వారి త్యాగాల ద్వారా నేడు ప్రశాంత వాతవరణం నెలకొందని, అలాగే అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా రేపటి నుండి 31 తారీఖు. వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా పోలీస్ కమిషనర్వెల్లడించారు. ఈ కార్యక్రమములో డిసిపిలు మురళీధర్, రవీందర్, అబ్దుల్బారి, అదనపు డిసిపిలు సంజీవ్, సురేష్ కుమార్, రాగ్యానాయక్ తో పాటు ఏసిపిలు, ఇన్స్స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఎస్.ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.