Saturday, July 5, 2025

ఆపద మొక్కులోళ్లను నమ్మొద్దు: కేసీఆర్

ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్

రాజన్నసిరిసిల్ల జిల్లా/సిద్ధిపేట:ప్రజలకు మంచిచేస్తుంటే ఎన్నికలు రాగానే కొందరు ఆపద మొక్కుల వాళ్లు వస్తారని, అలాంటి వారి మాయలోపడొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం ఆయన ప్రశా ఆశీర్వాద సభల్లోభాగంగా రాజన్నసిరిసిల్లజిల్లా, సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో మాట్లాడుతూ ప్రతిపక్షాలను ఉద్దేశించి కేసీఆర్ మండిపడ్డారు. నీచాతి నీచంగా రాజకీయం చేసే చిల్లర గాలు ఉంటారని, చేనేత కార్మికులు బతకాలి మరమగ్గాలు నడవాలని, అవన్నీ జరగాలంటే వారికి పని పుట్టించాలని అన్నారు.  బతుకమ్మ రంజాన్ క్రిస్మస్ వంటి పండుగలకు ప్రభుత్వం ఉచితంగా బట్టలు అందిస్తోందని, కనీసం కోటి కుటుంబాల నిరుపేదలకు బతుకమ్మ చీరల పథకం తీసుకొచ్చామని కేసీఆర్ తెలిపారు. ఈ పథకం ద్వారా 300 కోట్లతో ఇక్కడ పరిశ్రమలకు పని దొరుకుతోందని చెప్పారు.అటు పేదలకు బట్టలు అందుతున్నాయని చెప్పారు.

కానీ కొంతమంది దుర్మార్గులు ఆ చీరలను తీసుకుపోయి కాలబెట్టి మాకు ఈ చీరలు ఇస్తారా? అని అంటున్నారు.. అసలు అవసరం లేని వారు చీరలు ఎందుకు తీసుకుంటున్నారు? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇక్కడ ఉరి పెట్టుకొని అప్పుల పాలన చేనేత కార్మికుల కన్నీళ్లు తురిచే గొప్ప మానవతా దృక్పథంతో చేపట్టిన పథకం ఇదని, ఇక్కడ పనిచేస్తున్న ఎమ్మెల్యే కేటీఆర్ ఆ పథకం ప్రతాపాదిస్తే కేబినెట్ ఆమోదించిందని కేసీఆర్ అన్నారు. చేనేత కార్మికులను కాపాడుకోవాలని ఈ పథకాన్ని పెట్టుకున్నామని, కానీ కొందరు దుర్మార్గులు మాటలు నమ్మొద్దని కెసిఆర్ సూచించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెద్ద ప్రమాదం పెంచి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు ఆ పార్టీ తన భుజం మీద గొడ్డలి పెట్టుకొని రెడీగా ఉందని రైతులకు మళ్ళీ కష్టాలు తీసుకొస్తుందని కేసీఆర్ అన్నారు రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఇవాళ ఎక్కడ చూసినా పంట పొలాలతో ఒక బెత్తరి జాగా ఖాళీ లేకుండా వరినట్లు కనబడుతున్నాయని కేసీఆర్ తెలిపారు. ఇది చాలా సంతోషకర విషయం అన్నారు. మూడు కోట్ల మెట్రిక్ టన్నుల దాన్యం పండించే నా తెలంగాణ బిడ్డలు సన్నబియ్యం తినాలని ఉద్దేశంతో వచ్చే ప్రభుత్వంలో సన్న బియ్యం ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టుకున్నామని కేసీఆర్ అన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే కేటీ రామారావు మీకే నాకంటే ఎక్కువ తెలుసు, ఇక్కడ రావాల్సినవన్నీ వచ్చే గొప్ప విద్యా కేంద్రంగా తీర్చిదిద్ది దిగుతున్నామని అన్నారు. నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, అన్ని రంగులు సిరిసిల్ల ప్రాంతానికి ఏర్పడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

పాతవిషయాలను గుర్తు చేసుకున్న కేసీఆర్

సిద్ధిపేటలో జరిగిన సభలో మాట్లాడుతూ ధరణి వల్ల 98 శాతం మంది రైతులకు మేలు కలిగిందని సిద్దిపేటలో నిర్వహించిన సభలో కేసీఆర్ అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేట నా జన్మభూమి అని స్వర్గం లేదని జన్మభూమిని మించిన స్వర్గం లేదని కెసిఆర్ అన్నారు. సిద్దిపేట రుణం జన్మలో ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను అన్నారు. సిద్దిపేటతో ఎంతో అనుబంధం నాకు ఉందని సిద్దిపేటలో నేను తిరగని పల్లె ప్రాంతం లేదని అన్నారు. చింతమడకలో నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నాకు తాగడానికి పాలు లేకపోతే ముదిరాజ్ తల్లి నాకు పాలు పట్టింది అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు . సిద్దిపేట మంచినీళ్ల పథకం రాష్ట్రానికి ఆదర్శమని సిద్దిపేట హరీష్ రావు ఎన్నో రేట్లు అభివృద్ధి చేశారని చెప్పారు సిద్దిపేట అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని తెలంగాణలోని సిద్దిపేట వజ్రం తునకల్లా తయారవుతుందని అన్నారు ఆరడుగుల బుల్లెట్ హరీష్ రావు సిద్దిపేటకు అప్పగించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

 

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page