-వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
వరంగల్ , / జనతా న్యూస్: వ్యక్తిగత ఆరోగ్య సమస్యలపై సిబ్బంది అలసత్వం వహించకుండా తగు జాగ్రత్తలు వహించాలని పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు సూచించారు. విధి నిర్వహణలో ఎదురయ్యే పని ఒత్తిళ్ళను అధిగమిస్తు నిరంతరం విధులు నిర్వహిస్తున్న వరంగల్ కమిషనరేట్ పోలీసుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు స్థానిక భీమారంలోని శుభం కళ్యాణ వేదిక శనివారం పోలీస్ సిబ్బంది, అధికారులకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధిగా హజరయి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరానికి హజరయిన పోలీసులకు వైద్యులు ఇ.సి.జి. 2డి యుకో, బి.పి, షూగర్ లాంటి పరీక్షలను నిర్వహించడంతో పాటు అవసరమయిన వారికి మందులను అందజేయడంతో పాటు విధి నిర్వహణతో పాటు, వ్యక్తిగతంగా ఎదురయ్యే ఒత్తిళ్ళను అధిగమించేందుకుగాను తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మానసిక ఆరోగ్యం కోసం పాటించాల్సిన తీరును ప్రముఖ సైక్రియాటిస్ట్ జగదీశ్వర్ రెడ్డి పోలీస్ అధికారులకు కౌన్సిలింగ్ ద్వారా తెలియజేసారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో ఆరోగ్యం చాలా కీలమని, మనిషి ఆరోగ్యంగా వుంటే సంపద మన వద్ద వున్నట్లే అని, విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిళ్ళ సమన్వయం అధిగమిస్తూ తమ వ్యక్తిగత ఆరోగ్యం పట్ట పోలీసు శ్రద్ద వహించాలాని, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపేందుకుగాను ప్రతి ఒక్కరు శారీరక వ్యాయామాన్ని కోనసాగిస్తునే ఆరోగ్యవంతమైన ఆలవాట్లపై దృష్టి పెట్టాలని అలాగే తమతో పాటు తమ కుటుంబ సభ్యులను ఏడాది ఒకమారు ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ సూచించారు.ఈ కార్యక్రమములో సెంట్రల్ జోన్ డిసిపి అబ్దుల్ బారీ, అదనపు డిసిపి సంజీవ్, ఎసిపిలు నాగయ్య,జితేందర్, కిరణ్‌కుమార్,మల్లయ్య, డేవిడ్ రాజు,అనంతయ్య, సురేందర్, రమేష్‌కుమార్, ఆర్.ఐలు శ్రీధర్, చంద్రశేఖర్, శ్రీనివాస్, ఇన్స్‌స్పెక్టర్లు అబ్బయ్య, షుకూర్, కరుణాకర్, రాఘవేందర్, ఉస్మాన్‌షరీఫ్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శోభన్ గౌడ్, డా.శేషుమాధవ్, డా.ప్రవీణ్‌కుమార్, డా.సనత్‌కుమార్,డా. సుధీప్, డా.జగదీష్ బాబు, డా.షీతల్, డా.రాకేశ్‌రెడ్డి, డా.నరేష్,డా.భగీరథ్‌తో పాటు రోహిణీ,భగీరథ్, ఆదిత్య,కూరపాటి , సెయింట్ పీటర్స్ ఫార్మసీ, కేర్ హస్పటల్స్‌కు చెందిన సిబ్బంది, ఎస్.ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.