Malegav Cinema Theatre: అదో సినిమా థియేటర్.. అభిమాన హీరోను వెండితెరపై చూసేందుకు చాలా మంది ప్రేక్షకులు వచ్చారు. ఇంతలో కొందరు ఆకతాయిలు థియేటర్లోనే దీపావళి వేడుకలు చేసుకున్నారు. తమతో తీసుకొచ్చిన బాణ సంచాను ఒక్కసారిగా కాల్చారు. దీంతో భయంతో ప్రేక్షకులు పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని మాలేగావ్ అనే థియేటర్లో సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ రన్ అవుతోంది. దీపావళి సందర్భంగా ఆదివారం ఈ మూవీ రిలీజ్ అయింది. దీంతో ఈ సినిమా చూసేందుకు చాలా మంది ప్రేక్షకులు వచ్చారు. కానీ కొందరు ఆకతాయిలు థియేటర్ లోపల పటాసులు పేల్చడం అందరినీ భయాందోళనకు గురి చేసింది. ఈ వీడియోపై పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి వారిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.