దీపావళి సెలవును తెలంగాణ ప్రభుత్వం సైతం మార్చేసింది. ముందుగా ఇది నవంబర్ 12న ఆదివారం ఉండగా.. తాజాగా 13వ తేదీకి మార్చారు. కొన్ని రోజులుగా ఉద్యోగ సంఘాలు దీపావళి సెలవును 12 నుంచి 13 సోమవారానికి మార్చాలని కోరుతున్నారు. వారి విజ్ఒప్తి మేరకు ప్రభుత్వం సెలవును మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏపీలో 12 నుంచి 13 మార్చారు. ప్రస్తుతం తెలంగాణలోనూ మారడంపై చర్చనీయాంశంగామారింది. గతంలో దీపావళి సెలవును 12వ తేదీన ప్రకటిస్తు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మారిన సెలవు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కూడా దీనిని అమలు చేయాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. పండితుల సలహా మేరకే సెలవు దినాన్ని మారుస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలోనూ దీపావళి సెలవు మార్పు..
- Advertisment -