కరీంనగర్, జనతా న్యూస్:కరీంనగర్ పట్టణం తీగలగుటపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నిరుపేద విద్యార్థినీలకు 11 సైకిలను ఉమెన్స్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ అందించింది. సంస్థ చైర్మన్ జమున ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థినిలకు కు దాదాపు లక్ష రూపాయల విలువ చేసే 11 సైకిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 1వ డివిజన్ కార్పొరేటర్ కోలగని శ్రీనివాస్ గారు సొసైటీ చైర్మన్ జమున ని సత్కరించి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు , సిబ్బంది పాల్గొన్నారు.

