Thursday, July 3, 2025

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ కే సాధ్యం

ముఖ్యమంత్రి కెసిఆర్

వరంగల్, జనతా న్యూస్):
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ముందుకు తీసుకుపోతున్నది కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని హనుమకొండ జిల్లా కడిపికొండ శివారులో ఏర్పాటుచేసిన ఆశీర్వాద బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరై మాట్లాడారు.

మీ అందరి ప్రియతమ నాయకులు ఆరూరి రమేష్ సత్యవతి రాథోడ్, హనుమకొండ ఎమ్మెల్యే నరేందర్ , దయాకర్ రావు, ఎంపీ దయాకర్, శాసనమండలి చైర్మన్ బండ ప్రకాష్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి నాయకులు తెలంగాణ రాష్ట్రం కోసం 24 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన నేను చావు నోట్లో తలకాయ పెట్టి 15 సంవత్సరాల పోరాటం తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఒక్కొక్క సమస్యను అధిగమిస్తూ మన ముందుకు పోతున్నాం ప్రధానంగా సమస్యలను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలను కూడా కాపాడుకుంటూ మన ముందుకు పోయినం రైతుల విషయంలో కావచ్చు కరెంట్ విషయంలో కావచ్చు మంచినీళ్ల విషయంలో కావచ్చు శాశ్వతంగా వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందు కదిలిన చాలామంది వచ్చి ఎన్నికలలో అవాకులు, చెవకులు చెప్తారు . వాళ్లకు తెలంగాణ మీద పట్టింపు లేదు. తెలంగాణ మీద పెత్తనం కావాలి, తెలంగాణలో అధికారం కావాలి. కరెంట్ పరిస్థితి ఏంది, ఎరువు బస్తాల పరిస్థితి ఏంది ,ఏ పరిస్థితి ఎట్లా ఉందో మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు .మీరు అన్ని తెలిసిన వాళ్లు మిత్రులు రమేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గం అన్ని రంగాలలో బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించింది. గతంలో పేరుకే ఎస్ఆర్ఎస్పీ కాలువలు ఉండే వాటిలో చెట్లు మొలిచి ఉండేది. కానీ నేడు కానీ ఎమ్మెల్యే రమేష్, మంత్రి దయాకర్ ,మంత్రి కడియం శ్రీహరి యొక్క నాయకత్వంలో ఆ కాలువలను బాగు చేసుకున్నాం. నీళ్లు తెచ్చుకుని బ్రహ్మాండమైన పంటలు పండిస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే, అయినవోలు మండలాలకు పుష్పలంగా మీరు అందుతుంది, ఇప్పుడు జరిగే ఎన్నికలలో ఇంత పెద్ద ఎత్తున మీరు ఈ సభకు కదిలి వచ్చిన వెంటనే అర్థం అయిపోతా ఉంది ఆరురి రమేష్ ప్రజలలో ఉండే నాయకుడు మంచి నాయకుడు ఇటీవల కాలంలోనే 160 కోట్ల రూపాయలు తెచ్చి వర్ధన్నపేట మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి వర్ధన్నపేట పట్టణాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం.

మనం ఎలక్షన్లు గెలవడానికి షార్ట్ కట్ మెథడ్ అవలంబించేవాళ్లు అబద్ధాలు చెప్తా ఉన్నారు . మీరు గ్రామాల్లో చర్చ పెట్టాలి. వ్యవసాయం ఎట్లా ఉండే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు . కాంగ్రెస్ నాయకుడు ఉత్తంకుమార్ రెడ్డి వేస్ట్ గా ప్రజల టాక్స్ డబ్బులు వృధా చేస్తున్నాడని అన్ని రైతుబంధు ఆపేయాలని అంటున్నాడు ఇంత మంచి కార్యక్రమం ఆపేయాల్నా మీరే చెప్పాలి ! రైతు బంధు అనే పదాన్ని పుట్టించిన కేసీఆర్ దళిత బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ సంవత్సరానికి 500 పెంచి దాన్ని ఐదు వేల రూపాయల వరకు తీసుకెళ్తామని నేను చెప్పడం జరిగింది. ఈసారి రమేష్ మెజారిటీ ఒక లక్ష దాటాలని నాకంటే ఎక్కువ రావాలి కాంగ్రెస్ రాజ్యంలో ఎట్ల ఉండే గతంలో ఇంత కఠినంగా ఉండే ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఏ మండల కేంద్రంలో ఆ మండల కేంద్రంలోని ఎంత సులభంగా జరుగుతున్నాయో మీకు తెలుసు. కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు మరి రైతు బంధు ఎట్లా రావాలి ఈ సదుపాయం మొత్తం భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేదు. నేను రైతుబంధు పెట్టినాడు రైతు రాజ్యంగా పేదల రాజ్యంగా పురోగమిస్తున్న తెలంగాణ మనం మంచినీళ్ళ బాధ పోయింది, కరెంటు పోయింది. కరెంటు ఉన్నది ఒకటే మొత్తంలో రాష్ట్రంలో ఇదే విధంగా ఈ అభివృద్ధి కొనసాగాలంటే బ్రహ్మాండంగా బీఆర్ఎస్ గెలవాలి. వర్ధన్నపేటలో రమేష్ గెలవాలి ధనంతోని అహంకారంతోని ప్రజలను చూడకుండా ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది .వాళ్ళు మాట్లాడతారు దళితుల కోసం బీసీల కోసం గిరిజనుల కోసం అన్ని ముస్లింల కోసం పెట్టిన ఏకై గవర్నమెంట్ టిఆర్ఎస్ స్కూల్ చదువుకున్న పిల్లలు మెడికల్ కాలేజ్ అదేవిధంగా ఈ విలీన గ్రామాలలో కొంచెం అభివృద్ధి కూడా కావాల్సిన అక్కడే ఉంది. వాడికి ప్రత్యేకమైన ఫండ్స్ కూడా ఇచ్చి చేయించే బాధ్యత నేను తీసుకుంటా, ఆర్థికంగా ఉద్యోగ కల్పనలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్ది ముందుకు తీసుకొని పోయేటువంటి అవకాశాన్ని అభివృద్ధిని కొనసాగించాలని మీ అందరిని కోరుతూ సింపుల్ గా ఉండే వ్యక్తి ఒక ప్రజల మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి రమేష్ కు బ్రహ్మాండంగా అధిక మెజార్టీ ఇవ్వాలని కోరుతున్నాను.కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page