Devara:జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమా విడుదల వాయిదా పడింది. దసరా పండుగ సందర్భంగా ఈ మూవీని అక్టోబర్ 10న రిలీజ్ చేయడానికి తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం రెండు భాగాలుగా ఉంటుందన్న విషయం తెలిసిందే. దేవర పార్ట్ 1 సినిమాని ఏప్రిల్ 5న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జాప్యం కారణంగా సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. ఇందులో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మాత.
Devara: ‘దేవర’..వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే?
- Advertisment -