మొగిలిరేకులు సీరియల్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇప్పటికి ఈ సీరియల్ టీవీ ల్లో వస్తే చూడకుండా ఉండలేరు. ఈ సీరియల్ లో నటించినవారికి ఫిల్మ్ ఇండస్ర్టీ లెవల్లో గుర్తింపు వచ్చింది. మంజులనాయుడు డైరెక్షన్లో వచ్చిన ఈ సీరియల్ లో దయ పాత్ర గురించి టీవీ ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ఈ పాత్రలో నటించిన పవిత్రనాథ్ ఇటీవల మరణించారు. ఈ విషయాన్ని మొగిలిరేకులు నటులు ఇంద్రనీల్, ఆయన భార్య మేఘన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సందర్బంగా వారు ఏమిషనల్ పోస్ట్ పెట్టారు. ‘మా జీవితంలో అతి ముఖ్యమైన వాడిని కోల్పోయాం..ఈ భాధ తట్టుకోలేనిది’ అంటూ వారు పెట్టిన పోస్టుపై అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
మొగిలిరేకులు సీరియల్ నటుడి మృతి
- Advertisment -