Saturday, March 14, 2026

బధిరుల ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలి: కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, జనత న్యూస్: వైకల్యం తోడైన అద్బుతమై  విజయాలను సొంతం చేసుకోగల బధిరుల ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్నేహిత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, శరీరంలో అన్ని అవయవాలు సరిగా పనిచేసినప్పట్టికి అనుకున్న విజయాలను సాధించడంలో కొందరు వెనకబడి పోతారని, కాని వైకల్యం తోడైనప్పటికి సకలాంగులకన్న అద్బుతమైన విజయాలను బధిరులు సునాసంగా సాధించగలరని, అలాంటి వారి ప్రతిభను ప్రపంచానికి చాట్టిచేప్పాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు .
గతంలో పనిచేసిన జిల్లాలలో స్నేహిత కార్యక్రమాలను నిర్వహించినప్పటికి, కరీంనగర్ జిల్లాలో బధిరుల పాఠశాలలో నిర్వహించిన స్నేహిత కార్యక్రమం ఎక్కువ సంతోషాన్నిచ్చిందని అన్నారు.  మానసిక, శారీరక వికలాంగుల కొరకు సమయాన్ని, శక్తిమేర కృషిని ప్రతిఒక్కరు అందించాలని పిలుపునిచ్చారు.  వయస్సుతో పాటు శరీరంలో మార్పులు సంభవిస్తాయని, వాటికి అనుగునంగా పిల్లలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్, విద్య ప్రాముఖ్యం మరియు పాఠశాల వద్ద లేదా ఇంటివద్ద ఎవరివల్లనైన ఇబ్బందులు ఎదురైతే వాటిని గురించి దైర్యంగా తల్లితండ్రులకు గాని టీచర్లకు గాని చెప్పేలా పిల్లలను ప్రోత్సహించాలన్నారు.  గతంలో సంక్షేమ శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన క్రిడాపోటిలలో చెస్ పోటీలలో పాల్గోన్న అంధులను చూడగానే ఎంతో ఆద్భుతంగా అనిపించిందని, ఈలాంటి సంఘటనలు అనుకున్న విజయాలను సొంతం చేసుకోవడంలో ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకు సమాదానాలుగా నిలుస్తాయని అభివర్ణించారు.
జిల్లాలోని బధిరుల పాఠశాలలో లైబ్రరి ఏర్పాటు చేస్తానని హామిఇచ్చారు. అనారోగ్యం బారిన పడకుండా ప్రతి ఒక్కరు చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, పరిశుభ్రతను పాటించడం, ఉతికిన బట్టలు వేసుకోవడం వంటి వాటిని పాటించాలని, మనం ఎంత పరిశుభ్రంగా ఉంటామో అంత అందంగా కనిపిస్తామని తెలిపారు.  విద్యలోనే కాదు అవకాశం లభిస్తే ఎ రంగంలోనైన విజయాన్ని సాధించగలమనడానికి నిదర్శనంగా నేటి బధిరుల పాఠశాల విద్యార్థులు నిలిచి ఎందరికో అందర్శంగా నిలిచారని కొనియాడారు.
 అంతకుముందు బధిరుల విద్యార్థులు కాగీతాలతో చేసిన పూల బోకేలను, పేపర్ పై గీసిన కలెక్టర్ చిత్రాన్ని కలెక్టర్ కు అందించారు.  అనంతరం నృత్యప్రదర్శన చేసి గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఇతరుల వల్ల కలిగే ఇబ్బందులపై ఎలా స్పందించాలి అనే వాటిని ప్రదర్శించారు.  అనంతరం  ఫిబ్రవరి 4,5 మరియు 6వ తేదీలలో  ముంబాయిల్ జరిగిన  సైరో ఒలంపిక్ లో పాల్గోని16 ఇవెంట్ లలో 17 బహుమతులు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, మెమెంటో లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, జిల్లా సంక్షేమశాఖ అధికారి సరస్వతి, మార్కెటింగ్ అధికారి పద్మావతి, ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ నాగలక్ష్మి, ఉపాధ్యాయులు, సి డబ్ల్యూ సి ధనలక్ష్మి, డాక్టర్ నజియా ఫాతిమా, షీ టీం సీఐ శ్రీలత, స్వప్న, పాఠశాల సిబ్బంది, ఇతర అధికారులు, పాల్గోన్నారు.
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page