మంథని, జనతా న్యూస్:అవధూతదత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఉత్తరాధికారి దత్త విజయానందతీర్థ స్వామీజీ ల దివ్య ఆశీస్సులతో నవకోటి దత్తహోమము లోని అంతర్భాగముగా లోక కల్యాణార్ధము 7వ కోటి లోని భాగంగా మంథని దత్తాత్రేయాలయంలో శనివారం దత్త హోమం నిర్వహించారు.దత్తాత్రే ఆలయంలో శతాబ్దిని పురస్కరించుకునిశ ని ఆదివారాలు రెండు రోజులపాటు దత్తహోమము నిర్వహిస్తున్నామని నిర్వాహకుడు అవధానుల సీతారామ శర్మ తెలిపారు. ఈ హోమ దర్శనము, మంత్ర శ్రవణము శుభప్రదమని కావున భక్తులెల్లరూ హోమములో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. విజయవాడ హైదరాబాదు నుండి వేద బ్రాహ్మణులు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. అవధానుల శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దత్త గుడి పూజారి కొల్లారపు వేంకట రాజం, మహవాది ఆనంద్, చెన్నూరి ఆదిత్య, జక్కుల చంద్రశేఖర్ పి రామ్ కుమార్ లతో పాటు వేద బ్రాహ్మణులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మంత్రపురిలో దత్త హోమం
- Advertisment -