మళ్లీ పోటీ చేసి గెలువు
భాను ప్రసాదరావుకు మాజీ మేయర్, చల్లా సవల్
కరీంనగర్ -జనత న్యూస్
దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలువాలని భాను ప్రసాద రావుకు సవాల్ విసిరారు బీఆర్‌ఎస్ నేతలు. కరీంనగర్ లోని ఓ ప్రయివేటు హోటల్‌లో నాయకులతో కలసి మీడియాతో మాట్లాడారు సివిల్ సప్లై కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్. ఓటు హక్కు లేకున్నా, ఉద్యమ కారులను కాదని భాను ప్రసాద రావుకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీగా కేసీఆర్ గెలిపించారని గుర్తు చేశారు. పార్టీ మారిన భాను ప్రసాద రావు ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని..వెంటనే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని డిమాండ్ చేశారు. ఎవరికి సమాచారం ఇవ్వకుండా దొంగలాగ అర్దరాత్రి పార్టీ మారాడని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీకి రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే… పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా భాను ప్రసాద్ చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. కేకే తరహాలో భాను ప్రసాద రావు రాజీ నామా చేయాలని హితవు చెప్పారు. ఈ సమావేశంలో గుంజపడుగు హరిప్రసాద్, ఇతర నాయకులున్నారు.
రాజీనామా చేయకుంటే అడ్డుకుంటాం
బీఆర్‌ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుంటే భాను ప్రసాద రావు ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్. కరీంనగర్‌లో నాయకులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం ఎక్కడ ఉంటే..అక్కడ భాను ప్రసాద రావు వాలుతారని ఎద్దేవ చేశారు. ఉద్యమకారులైన నారదాసు లక్ష్మణరావు, రవీందర్ సింగ్ లను కాదని… సీఎం కేసీఆర్ భాను ప్రసాద్ రావుకి టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. స్వార్థ రాజకీయాల కోసం వచ్చిన వారు పార్టీ మారుతున్నారే తప్ప, ఉద్యమకారులు, బిఆర్‌ఎస్ కార్యకర్తలు మారడం లేదని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ నాయకుల ఇండ్లను ముట్టడిస్తామని, రాజీనామా చేసేవరకు అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నగర బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ కరీంనగర్ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.
దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి గెలువు
- Advertisment -