జనత న్యూస్ బెజ్జంకి : స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట గూడెం దళితులు చేపట్టిన నిరాహార దీక్ష గురువారం 18 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్ష చేస్తున్న దళితులు మాట్లాడుతూ గత ప్రభుత్వం దళితుల కోసం కేటాయించిన మూడు ఎకరాల భూమి కేటాయింపులో అనర్హులకే చెందిందని, అర్హులైన నిరుపేదలైన మాకు దక్కలేదని అన్నారు. 18 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ స్పందించిన నాథుడే లేడని వాపోతున్నారు. అధికారులు చూచి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, ఎన్నికల నియమావళి వచ్చినందున దీక్ష విరమించాలని అధికారులు సూచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరాహార దీక్ష చేస్తున్న మాకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని వేడుకుంటున్నట్లు తెలిపారు.
18వరోజుకు దళితుల నిరాహార దీక్ష
- Advertisment -