Cyclone Warning : ఒడిశా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. పశ్చిమ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఇది గంటకు 20 కిలోమీటర్ల వేగంతో గాలులు దూసుకొస్తు్నాయి. దీంతో ఏపీలో వివిధ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫానుతో సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మాల్దీవులు సూచించిన ఆధారంగా దీనికి ‘మిథిలీ’ అని పేరు పెట్టారు. నవంబర్ 16న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకొని 17న ఒడిశా తీరానికి చేరనుంది. ఆ తరువాత శనివారం ఉదయం ఏపీ, తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Cyclone Warning : బంగాళాఖాతంలో ‘మిథిలి’ తుఫాను.. బలమైన గాలులు..
- Advertisment -