-సిద్దిపేట సీపీ అనురాధ
సిద్దిపేట,జనత న్యూస్: ఆశ..భయం అంశాలపైనే అపరిచితులు సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట సీపీ అనురాధ సూచించారు. బాధితుల పిర్యాదు మేరకు రూ.35,29,593 లక్షలను ప్రీజ్ చేసామని.. విడతలవారీగా బాధితుల బ్యాంక్ అకౌంట్ లో నగదు జమవుతాయని సీపీ తెలిపారు. సైబర్ ఆర్థిక నేరాలలో ఎవరైనా బాధితులు నగదు పోగొట్టుకుంటే వెంటనే జాతీయ సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ https://cybercrime.gov.in వివరాలు నమోదు చేయాలని సీపీ సూచించారు.
కేవైసీ అప్డేట్ అంటూ సైబర్ నేరం..
సిద్ధిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన ఒ బాధితుడికి గుర్తుతెలియని సైబర్ నేరగాడు ఫోన్ చేసి ఎస్బీఐ స్పామ్ నుంచి మాట్లాడుతున్నట్లు, క్రెడిట్ కార్డ్స్ కేవైసీ అప్డేట్ చేసుకోవాలని సైబర్ నేరగాడు చెప్పాడు. దీంతో నమ్మిన సదరు బాధితుడు కార్డ్ నెంబర్, ఓటీపీ నెంబర్ చెప్పాడు.సదరు బాధితుని అకౌంట్ నుండి రెండు విడతలుగా రూ.1,34,000 డెబిట్ అయ్యాయి. బాధితుడికి అనుమానం రావడంతో వెంటనే సైబర్ సెల్ జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. ఈమేరకు ఏసీపీ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.