Saturday, July 5, 2025

శ్రీశైలంలో భక్తుల రద్దీ

కార్తీక సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ విపరీతంగా కనిపించింది. ఈ సందర్భంగా క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.సోమవారం ఉదయం 4 గంటల నుచే భక్తులు భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వారలను దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో పాతాళ గంగలో పుణ్యస్నానాలు చేశారు. ఆలయ ఎదుట ఉన్న గంగాధర మండపం, ఉత్తర మాడ వీధుల్లో కార్తీక దీపారాధన చేశారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page