నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఏపీలోని ఇంద్రకీలాద్రి కొండపై ఎటూ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. క్యూలైన్లు నిండిపోవడంతో వీఎంసీ వద్ద కంపార్టుమెంట్లను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. మూలనక్షత్రం సందర్భంగా విశాఖలోని శారదాపీఠంలో అక్షరాభ్యాసాలు సాగుతున్నాయి. తిరుమలలోనూ భక్తుల రద్దీ పెరిగింది. గరుడోత్సవం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీవారి దర్శనానికి 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువవారం 66,757 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
అమ్మవారి ఆలయాల్లో భక్తుల సందడి
- Advertisment -