Saturday, March 14, 2026

పంట నష్టపోతాం.. కాలువ నీళ్లు ఆపండి

  • బేగంపేట గ్రామ రైతుల ఆవేదన
  • బెజ్జంకి తహసిల్దార్ కి వినతి పత్రం సమర్పణ

జనతా న్యూస్ బెజ్జంకి :బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన రైతులు సోమవారం స్థానిక తహసిల్దార్ ఎర్రోళ్ల శ్యామ్ కు పంట నష్టం గురించి వినతిపత్రం సమర్పించారు. బేగంపేట గ్రామంలో సాగు కాల్వల ద్వారా పాత చెరువులో నీటిని నింపుతారని ప్రచారంతో ఆందోళన చెందిన చెరువు పరిసర ప్రాంతాల రైతులు పంట నష్టపోతామని, ఇప్పటికే వరి నాట్లు వేశామని మే నెల మొదటి వారం వరకు నీటిని నింపవద్దని వారి వారి పట్టా భూములలో వేసుకున్న పంట పొలాలు ముంపుకు గురవుతావని, తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన చెందుతూ తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ రైతు సమన్వయ కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, రైతులు పురుషోత్తంఅంజయ్య గౌడ్, దొనపాటి బాపురెడ్డి, జంగిటి తిరుపతిరెడ్డి, పట్నం కొమురయ్య, తాండ్ర దుర్గవ్వ, జనగం లక్ష్మి, గోవికారి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page