నేర చరిత్ర ఉన్న వారే ఎక్కువగా లా చదువుతున్నట్లు గుర్తించారో ఏమో..బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు తీసుకొచ్చింది. లా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు మొమో సర్టిఫికెట్ తీసుకునే ముందు నేర చరితను పరిశీలించాలని విశ్వ విద్యాలయాలకు సూచించింది బీసీఐ.
విద్యార్థిపై నమోదైన ఎస్‌ఐఆర్, శిక్ష తదితర వివరాలు వెల్లడిరచాలని.. ఒకవేళ నేరచరిత్ర ఉంటే బీసీఐకి పంపి అనుమతి వచ్చాకే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న న్యాయ విద్యను అందించే విశ్వ విద్యాలయాలు, ఆయా కళాశాలలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ఆయా నిబంధనల మేరకు హామీ పత్రం సైతం ఇవ్వాల్సి ఉంటుందట. విద్యార్థులకు బయో మెట్రిక్ అటెండెన్స్, సీసీ టీడీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో పాటు న్యాయ విద్య చదివే విద్యార్థులు అదే సమయంలో ఇతర కోర్సుల్లో చదవడం లేదని, ఉద్యోగం సైతం చేయడం లేదని విద్యార్థులు నిరూపించాల్సి ఉంటుంది.
నేర చరిత్ర ఉంటే..లా పట్టా కష్టమే !

- Advertisment -