Crime: మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వెల్జాల్ నుంచి మిడ్జిల్ వెళ్తుండగా వాసిపల్లి మైసమ్మ దేవాలయం వద్ద ఎదురుగా వచ్చిన బైక్ ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్ ను తప్పించే క్రమంలో ఎమ్మెల్యే వాహనం రోడ్డు దిగి పొదల్లోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్ పై వస్తున్న వెంకటాపురం గ్రామానికి చెందిన పబ్బతి నరేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు బైరపాక పరుశురాం గాయపడగా అతని చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఎమ్మెల్యే కారులోని ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడంతో ఎమ్మెల్యే తో సహా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి.
Crime:రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
- Advertisment -