Crime: షిల్లాంగ్ఫ బాలికపై అత్యాచారానికి పాల్పడేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను కొట్టి చంపిన సంఘటన మేఘాలయ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మేఘాలయలోని ఈస్టర్న్ వెస్ట్ ఖాసీ హీల్స్ జిల్లాల్లో ని నోంగ్తి లీవ్ గ్రామంలోని ఒక ఇంట్లో ఒంటరిగా ఉన్న 17 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఆమెను బెదిరించి లైంగిక దారికి ప్రయత్నించారు. కాగా ఆ బాలిక కేకలు వేయగా స్థానికులు అక్కడకు చేరుకున్నారు. బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పట్టుకొని సమీపంలోనే కమ్యూనిటీ హాల్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సుమారు 1500 మంది భూమి గూడారు. వారంతా కలిసి ఆ ఇద్దరు వ్యక్తులను కట్టేసి దారుణంగా కొట్టారు. మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. జనం చెర నుంచి ఆ ఇద్దరు వ్యక్తులను రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే వారిని అక్కడ నుంచి తీసుకెళ్లేందుకు పోలీసులను జనం అనుమతించలేదు. ఇంతలో ఒక గుంపు ఆ ఇద్దరు వ్యక్తులను మరోసారి చావగొట్టారు. చివరకు ఆ చేతనంగా పడి ఉన్న వారిద్దరిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మృతులు ఇద్దరు ఆ గ్రామంలో కార్మికులుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Crime: అత్యాచార యత్న నిందితులను కొట్టి చంపిన గ్రామస్థులు
- Advertisment -