Thursday, September 11, 2025

Crime : చిన్నారుల ప్రాణాలు తీసిన పానీపూరీ

ఏలూరు: పానీపూరి అనగానే చిన్నారులు ఎంతో ఇష్టపడుతారు. కానీ అవి తిని ఇద్దరు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. ఇద్దరు బాలురు ఎంతో ఇష్టంగా పానీపూరి తిన్న తరువాత కడుపునొప్పితో బాధపడ్డారు. ఆ తరువాత వారిని ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా జంగారెడ్డి గ్రామానికి చెందిన వెలపాటి రామకృష్ణ, వెలపాటి విజయ్ లు బుధవారం స్థానికంగా ఉన్న పానీ పూరి తిన్నారు. ఆ తరువాత కడుపునొప్పితో బాధపడ్డారు. ఇది గమనించిన వారి తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే వారు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పానీ పూరి తిన్న తరువాత ఫుడ్ పాయిజన్ అయి మరణించినట్లు వారు వాపోతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page