Crime: రంగారెడ్డి, జనతా న్యూస్: తమ ఇంట్లో చోరీ జరిగిందని చెప్పిన ఓ బాలిక.. తల్లిదండ్రులతో పాటు పోలీసులను బురిడీ కొట్టించింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో అసలు నిజం ఒప్పుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఆన్ లైన్ గేమింగ్ కు అలవాటు పడ్డ ఓ బాలిక గేమింగ్ లో దాదాపు 25 వేల రూపాయలు పోగొట్టుకుంది. దీంతో కంగారు ఆమె తల్లిదండ్రులకు ఏమని చెప్పాలో తెలియక చోరీ నాటకానికి తెరలేపింది. గురువారం ఉదయం 10 గంటలకు తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అల్మారా లో ఉన్న దుస్తులు, గదిలోని లాప్టాప్, మొబైల్ ఫోన్ ఇతర వస్తువులను చిందరవంతరగా పడేసింది.అచ్చం సినిమాల్లో సీన్ రక్తి కట్టేలా చోరీ సీన్ క్రియేట్ చేసింది .ఆ ఆరువాత బాలిక గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి నగలు, నగదు దోచుకుని పారిపోయారని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసుల దర్యాప్తు చేసిన ఆధారాలు సేకరించారు. దీంతో చోరీ జరగలేదని గుర్తించారు. ఆ తరువాత బాలికను విచారించగా తప్పును ఒప్పుకున్నట్లు సీఐ నాగేంద్రబాబు తెలిపారు. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక పిల్లలపై తల్లిదండ్రుల అజమాయిషీ లేకపోవడంతో ఈ విధంగా ఆన్ లైన్ మోసాలకు గురవుతున్నారని సీఐ నాగేంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ పిల్లలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు
Crime: చోరీ పేరుతో బురిడీ కొట్టించిన యువతి..
- Advertisment -