రూ. 80 వేల జరిమానా విధించిన అధికారులు
హుజురాబాద్ , జనతా న్యూస్: హుజురాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బెల్ట్ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు సిఐ బొల్లం రమేష్ వెల్లడించారు. శనివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో బెల్ట్ షాపులు నిర్వహించిన ఊసకోయిల విష్ణువర్ధన్, ఆకుల తిరుపతి, కొక్కుల సత్యనారాయణ లపై కేసు నమోదు చేసి తహసిల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేశామని తెలిపారు. కానీ మళ్లీ పై ముగ్గురు బెల్టు షాపులు నిర్వహించినందున వారిపై కేసు నమోదు చేసి హుజురాబాద్ తహసిల్దార్ ఎదుట హాజరు పరిచి రూ. 80 వేల జరిమానా విధించామని తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పార్లమెంట్ ఎన్నికలకు అమలులో ఉన్నందున ఎవరైనా మద్యం అక్రమ రవాణా చేసిన కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.