Cricket : టీమిండియాకు మరో షాక్ కలిగింది. ఇప్పటికే కొంతమంది క్రీడాకారులు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. తాజాగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడవ టెస్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రెండో రోజు ఆటలో భాగంగా తీసుకున్న అశ్విన్ టెస్ట్ కెరియర్ లో 500 వికెట్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ తో జరగుతున్న రెండో రోజు ఆట ముగిసిన అనంతరం తక్షణమే వదిలిపెట్టి చెన్నైకి వెళ్ళాడు. దీనికి సంబంధించి బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. బీసీసీఐ అశ్విన్ తో టచ్ లో ఉన్నట్లు, అవసరమైతే ఏదైనా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అశ్విన్ జట్టు నుంచి తప్పుకోవడానికి కారణాలు వెల్లడించలేదు. ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పినా బీసీసీఐ అసలు కారణం చెప్పడం లేదు. కొన్ని నివేదికల ప్రకారం అశ్విన్ అమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ చేసిన ట్వీట్ లో అశ్విన్ అమ్మగారు త్వరలో కోలుకోవాలని చెప్పారు. దీంతో ఆయన తల్లి అనారోగ్యం కారణంగానే జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.
Cricket : రెండో టెస్ట్ నుంచి అశ్విన్ తప్పుకోవడానికి కారణం ఇదేనా?
- Advertisment -