అవినీతికి పాల్పడుతున్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపనలు
కరీంనగర్-జనత న్యూస్
అమృత్ పథకంలో అవినీతి జరిగిందని బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేస్తే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపడుతుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేటీఆర్‌కు మీడియా ఫోబియా ఉందని, గతంలో ఓటుకు నోటు కేసు విచారణ ఎందుకు జరుపలేదని బీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య లోపాయి కార ఒప్పందం జరిగిందని ఆరోపించారు. ఓవైసీ కాలేజి లో ఫ్యాకల్టీ ఉగ్ర వాదిగా పట్టుబడ్డాడని, సెక్యులర్ అనేవాళ్ళు హిందువుల పండుగ ఏనాడైనా జరుపుకున్నారా అని ప్రశ్నించారు. ఉగ్రవాదులను పెంచి పోషించేది ఎంఐఏం పార్టీ అన్న బండి సంజయ్.. వన్ నేషన్ , వన్ ఎలక్షన్‌కు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కొంతమంది కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. హైడ్రా చర్యలకు తాము వ్యతిరేకం కాదని, నిష్పాక్షికంగా కూల్చివేతలు జరగాలని సూచించారు. అక్రమ కట్టడాలకు కారణమైన బిఆర్ ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
అమృత్ పథకంలో అవినీతి ఫిర్యాదుపై కేంద్రం విచారిస్తుంది

- Advertisment -