- అంబేడ్కర్ స్టేడియంలో బోయినిపల్లి వినోద్ మార్నీంగ్ వాక్
- ఇరుపార్టీలు ప్రజలను మోసం చేసేవేనని ఆరోపణ
కరీంనగర్,జనత న్యూస్: స్వీస్ బ్యాంక్ నుండి నల్లధనం వెలికితీసి ప్రజలకు రూ.15 లక్షల ఇస్తామని అవినీతి పరులకు అంటకాగుతూ బీజేపీ..అధికారంలోకి వచ్చాక 6 గ్యారెంటీలను అమలు చేస్తామని అబద్దాల కాంగ్రెస్ పరిపాలన సాగిస్తున్నాయని..ఇరు పార్టీలు ప్రజలను మోసం చేసేవేనని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు.శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి బోయినిపల్లి వినోద్ కుమార్ మార్నీంగ్ వాక్ నిర్వహించి వాకర్స్ తో మాట్లాడారు.ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలింపించాలని ఓట్లు అభ్యర్థించారు. ఐదేళ్లలో ఎంపీగా బండి సంజయ్ ఒక్క గుడి తెలేదని..కాంగ్రెస్ హమీలన్ని అబద్దాలేనని వినోద్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్,మాజీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవిందర్ సింగ్, కార్పొరేటర్లు తోట రాములు,అయిలేందర్ యాదవ్, నాయకులు కలర్ సత్తన్న,సత్తినేని శ్రీనివాస్, వొల్లాల శ్రీనివాస్ గౌడ్,బెజిగం మధు,చొక్కారపు చంద్రం, రవినాయక్,కెమసారం తిరుపతి,జీఎస్ ఆనంద్, గూడెల్లి రాజ్ కుమార్,అంజియాదవ్,దూలం సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.