- 6 గ్యారంటీ కార్డు పథకాల వల్ల అందరికీ లబ్ధి చేకూరుతుంది
- ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు
మంథని, జనతా న్యూస్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు కోరారు. గురువారం మంథని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోనియా గాంధీ ప్రత్యేక చొరవ తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం వల్ల జరిగిన అభివృద్ధి ఏమీ లేదని ఆయన తెలిపారు ముఖ్యంగా నిధులు నియామకాలు పేరుతో అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ అందుకు అనుగుణంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు అన్నారు. ముఖ్యంగా మంథని ప్రాంతానికి ఎలాంటి నిధులు ఇవ్వకుండా అభివృద్ధి కి ఆటంకంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గజ్వేల్ సిద్దిపేట్ సిరిసిల్ల ప్రాంతాలకు మాత్రమే అధిక నిధులు ఇచ్చి అన్ని ప్రాంతాలను నిర్లక్ష్యం చేసింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీ కార్డు పథకాలను తూచా తప్పకుండా అమలుపరిచి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.