- పదేళ్లపాటు ప్రజలను వంచించి మాయమాటలతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నాయి
- ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలి ….
- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడితల ప్రణవ్
జమ్మికుంట, జనతా న్యూస్:తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్య స్థాపనె లక్ష్యమని దానికోసం నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆశీర్వదించి ఈనెల 30వ తారీఖున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒడితల ప్రణవ్ బాబు అన్నారు .ఆదివారం రోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి అధ్వర్యంలో తన స్వగృహంలో జమ్మికుంట ,ఇల్లంతకుంట మండలాలకు చెందిన టిఆర్ఎస్ ,బిజెపి పార్టీలకు చెందిన సుమారు 500 మంది నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రణవ్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు . ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ టిఆర్ఎస్ ,బిజెపి పార్టీలు రెండు ఒకే తాను గుడ్డలని గత పది సంవత్సరాలుగా కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ ప్రజలను మాయ మాటలు చెబుతూ మోసం చేస్తున్నారే తప్ప ఇప్పటివరకు ప్రజా సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు .రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీని కట్టబెట్టి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రజలందరూ సహకరించాలన్నారు .కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను నియోజకవర్గంలోని ప్రతి గడపగడపకు అందించి మీ ఆశీర్వాదం తీసుకుంటానని ప్రణవ బాబు అన్నారు .
- మహిళా సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ …
రాష్ట్రం తో పాటు దేశంలోని మహిళలందరూ సుభిక్షంగా ,సుఖశాంతులతో ఉండాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మహిళా సంక్షేమం కోసం పెద్దపీట వేస్తుందని దానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి మహిళా ఖాతాలో మహాలక్ష్మి పథకం కింద 25 వందల రూపాయలు ప్రతినెల జమ చేస్తుందని మహిళలకు ప్రతినెల 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందించాలని లక్ష్యంతో ముందుకు సాగుతుందని అలాగే రాష్ట్రంలోని ప్రతి మహిళ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మహిళా మణులకు తెలియజేశారు .కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల ఫైలు పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య సంతకం చేసి అమలు చేస్తున్నారన్నారు .డిసెంబర్ మూడవ తారీకు తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్ గ్యారంటీ లపై ఇక్కడి ముఖ్యమంత్రి సంతకం చేసి మహిళా మండల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తామన్నారు .
- మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్న బిజెపి , బిఆర్ఎస్ పార్టీలు..
మల్లొకసారి ఎన్నికల్లో గెలుపొందాలని బిజెపి బిఆర్ఎస్ పార్టీలు మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ నయవంచన గురి చేస్తున్నారని పదేళ్లపాటు అధికారంలో ఉండి సామాన్య ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేశారని దానికి నిదర్శనమే ఇప్పుడు ఉన్న నిత్యవసర సరుకుల ధరలని సామాన్యునిపై భారం మోపుతున్న పార్టీలను సార్వత్రిక ఎన్నికల్లో బొందపెట్టి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీకి అధికారం అందించి నిత్యవసర సరుకుల ధరలను అందుబాటులోకి తెచ్చుకున్న విధంగా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలన్నారు. ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో మాజీ ఎంపిటిసి మొలుగురు సదయ్య ,బిఆర్ఎస్ పార్టీ వావిలాల గ్రామ శాఖ అధ్యక్షుడు బొమ్మ శ్రీనివాస్ , మర్రి సదానందం , కలకోట యాదగిరి ,ఏ రెడ్డి నిరంజన్ రెడ్డి ,మణెమ్మ ,రమాదేవి ,ఎండి షమీంలతోపాటు సుమారు 500 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు . ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి , సుంకరి రమేష్ ,కసుబోజల వెంకన్న ,ఎండి సలీం , ఎగ్గిని శ్రీనివాస్ ,ఎండి హుస్సేన్ ,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.