-ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యె ఆది శ్రీనివాస్..
వేములవాడ, జనతా న్యూస్: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.మంగళవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు 16 కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపినందుకు కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ,రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్,ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాష్ట సమాచార, రెవెన్యూ,గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క), దేవాదాయ అటవి శాఖ మంత్రి కొండా సురేఖ లను కలిసి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు