ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న ఫాం హౌస్‌ల కూల్చి వేతలపై బీఆర్‌ఎస్ నేతల ఆరోపనలకు చెక్ పెడుతున్నారు కాంగ్రెస్ నేతలు. తమ ఫామ్ హౌజ్‌లో ఆయా పరిధిలో ఉంటే స్వచ్ఛందంగా కూల్చి వేస్తామని ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రాంచందర్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణను తాము స్వాగతిస్తున్నామని, సర్వేలో తన ఫాం హౌజ్ బఫర్ జోన్, ఎల్‌టీఎఫ్‌లో ఉంటే స్వచ్ఛందంగా కూల్చివేస్తానని స్ఫష్టం చేశారు. మూసీ విషయంలో ప్రతిపక్షాలది మొసలి కన్నీరే నని ఆయన ఆరోపించారు. కాగా..మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సైతం స్పందించారు. తన ఫాం హౌజ్ నిబంధనల మేరకు ఉందన్న ఆయన..ఒక వేళ విరుద్దంగా ఉంటే కూల్చి వేద్దామన్నారు. కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు చేసిన ఆరోపనలపై ఆయన మండి పడ్డారు. బీఆర్‌ఎస్ నేతలు పదే పదే చేస్తున్న ఆరోపనలపై కాంగ్రెస్ నేతలు సైతం స్పందిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతల ఫాం హౌస్‌లపై సర్వే ప్రభుత్వం సర్వే చేయిస్తుందా..లేక..వదిలేస్తుందా వేచి చూడాలి.
ఫాం హౌస్‌లపై కాంగ్రెస్ నేతల క్లారిటీ..!

- Advertisment -