Saturday, September 13, 2025

తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కాంగ్రెస్

  •  హామీలు విస్మరించిన బిజెపి, బి అర్ ఎస్ లకు తగిన బుద్ది చెప్పాలి
  •  అభివృద్ధి చేస్తామంటే… హుజురాబాద్ ప్రజలు ఆపారా..?
  •  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్

జమ్మికుంట, జనతా న్యూస్ : నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నెరవేర్చే పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం మండలంలోనీ మాచనపల్లి, అబాది జమ్మికుంట, జగ్గయ్య పల్లి, పెద్దంపల్లి, కేశవపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులకు హామీల అమలు చేస్తామని అన్నారు. టిఆర్ఎస్, బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయాలని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, అక్కడ 500 రూపాయలకే వ్యా సిలిండర్, కర్ణాటక రాష్ట్రంలో 62 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కాపీ చేసి పింఛన్లు పెంచేస్తామని టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుందని, ఉన్న పింఛన్లు సమయానికి ఇవ్వడం లేదు కానీ కొత్త పింఛన్లు ఇస్తామని హామీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. యువకులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సరైన వసతులు లేవని, తనను గెలిపిస్తే హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో డిజిటల్ లైబ్రరీలతోపాటు స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తానని హామీ ఇచ్చారు. వేయికోట్ల నిధులతో హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాటలు చెబుతున్నా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎవరు ఆపారని అన్నారు. మండలానీకో ఇంటర్నేషనల్ స్థాయి పాఠశాల ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్యానందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రెండు దశాబ్దాలుగా ప్రజలు ఈటెల రాజేందర్ ను గెలిపిస్తూ వస్తున్నారని, ఈ నియోజకవర్గ ప్రజలను కాదని గజ్వేల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. గజ్వేల్ కు వెళ్లి గజ్వేల్ ముద్దుబిడ్డనని, హుజురాబాద్ కు వచ్చి హుజురాబాద్ బిడ్డనని చెప్తున్నాడని అన్నారు. ఏడుసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ ఈ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు గడుస్తున్న హుజురాబాద్ కు చేయలేదని, కనీసం తన సొంత మండలమైన కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని సైతం పూర్తి చేయలేని పరిస్థితిలో ఈటెల రాజేందర్ ఉన్నారని అన్నారు. బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని బిజెపికి ఓటు వేస్తే టిఆర్ఎస్ కు వేసినట్టేనని, టిఆర్ఎస్ కు వేస్తే బిజెపికి వేసినట్లేనని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గం లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. వ్యాపారులకు అండగా ఉంటూ వారి అభివృద్ధి తోపాటు హుజూరాబాద్ ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page