కరీంనగర్,జనత న్యూస్: కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. కరీంనగర్ రూరల్, కరీంనగర్ నగరానికి చెందిన వందలాదిమంది బీజపీ,బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం ఆయా పార్టీలను వీడీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.వారందరికీ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కరీంనగర్ రూరల్ మండలంలోని నువునూరు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ దావు సంపత్,వార్డు సభ్యులు బోనగిరి హనుమంతరావు,కుంటా కరుణాకర్,అబ్దుల్ హమీద్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కామిరెడ్డి రామిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షుడు తిరుపతి,గ్రామ శాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్,మండల కార్యదర్శి తండ్రా లక్ష్మణ్,ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కొమరయ్య,కార్యదర్శి దాసరి రాజేష్ కన్నా,మండల ఉపాధ్యక్షుడు అతని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉజ్వల సంఘం నుండి 30 కుటుంబాలు..
నగరంలోని సుభాష్ నగర్ కు చెందిన ఉజ్వల సంఘం నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సంఘం అధ్యక్షులు జే.శివ,ఉపాధ్యక్షుడు జీ.విశ్వం, కోశాధికారి జీ.నర్సింగం,ప్రధాన కార్యదర్శి ఎస్ డి సాహెబ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కే. శ్రీహరితో 30 కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ తెలంగాణలో ఆరు గ్యారంటీలను నాలుగు నెలల్లోనే అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని అన్నారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచార్ల రాజేందర్ రావు భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు.