Saturday, March 14, 2026

సహకార సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి

  • రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, జనతా న్యూస్: రైతాంగం అభివృద్ధికి సహకార సంఘాలు ఎంతో దోహదపడతాయని, ప్రతి రైతు సహకార సంఘంలో సభ్యుడై ఉండాలని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.ఆదివారం చిగురుమాడి మండలంలోని రేకొండ గ్రామంలో రేకొండ హాలిక్ అండ్ శ్రమజీవి కో-ఆపరేటివ్ సొసైటీ 51 వ స్వర్ణోత్సవాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే సహకార సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు తో కలసి రూ4.60 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గోదాం ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి రైతు సహకార సంఘంలో సభ్యులు కావాలని, సహకార సంఘాలు రైతులకు ప్రభుత్వానికి వారధిగా పని చేయాలని అన్నారు. సహకార సంఘాల బలోపేతానికి నాడు కాంగ్రెస్ పార్టీ,మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్, తాను మార్క్ఫెడ్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎంతో కృషి చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ రాజకీయంగా రాణించాలంటే సొసైటీ ద్వారా ముందుకు వస్తే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. భారత హరిత పితామహుడు డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్ ఆహార వృద్ధి లో భారత దేశం ఎంతో పురోగతి సాధించినారు.ఈ

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సంఘ అధ్యక్షులు మండల కొమురయ్య, జిల్లా సహకార అధికారి రామాంజనేయులు, ఆర్డిఓ మహేశ్వర్, ఇంచార్జ్ జిల్లా పంచాయతీ అధికారి పవన్ కుమార్, ఎంపీపీ కె వినీత శ్రీనివాస్ రెడ్డి, జడ్పిటిసి గీకురు రవీందర్రావు, సర్పంచ్ రజిత ఎంపీటీసీ శోభ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page