- రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు
- దేశం కోసం పనిచేసేది బీజేపీనే సూచన
కరీంనగర్,జనత న్యూస్: కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల కోసం పోటీ పడుతుతున్న అభ్యర్థులు రాజేందర్ రావు,వినోద్ కుమార్ ఇరువురు రాజకీయ పురావాసం కోరేటువంటి అవకాశవాదులేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు ఆరోపించారు.సోమవారం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శక్తి కేంద్ర ఇంచార్జీలతో మండల కేంద్రం లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైంటువంటి ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ లేదని కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నరన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏనాడైనా ప్రజాక్షేత్రంతో సంబంధముటదాని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా మోదీ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే భాద్యత బీజేపీ కార్యకర్తలదేనని పేర్కొన్నారు.కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ చేసిన అభివృద్ధి పనులను వివరించాలని సూచించారు.కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు బీజేపీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని తెలిపారు.దేశం కోసం పని చేసేది బీజేపీనేనని గతంలో కంటే రెట్టింపు మెజారిటీ తో బండి సంజయ్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర,జిల్లా కార్యవర్గ సభ్యుడు మావురపు సంపత్,బూట్ల శ్రీనివాస్, చింతం శ్రీనివాస్, మండల ప్రధాన కార్యవర్గ సభ్యుడు కిన్నెర అనిల్, గొట్టిముక్కల తిరుపతి రెడ్డి, శక్తి కేంద్ర ఇంచార్జీలు పాల్గొన్నారు.
