విజయవాడ, జనత న్యూస్: కోడికత్తి కేసులో జనపల్లి శ్రీనివాసరావుకు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత ఐదేళ్ల కిందట ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి శ్రీనివాసరావు జైలులోనే ఉంటున్నారు. అయితే శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించిందని, అతనికి బెయిల్ మంజూరు చేయాలని అతని తల్లితో పాటు సోదరుడు నిరాహార దీక్ష చేశారు. ఈ నేపపథ్యంలో ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించవద్దని, సభల్లో పాల్గొనవద్దని కోర్టు పేర్కింది.
కోడికత్తి శ్రీనుకు షరతులతో కూడిన బెయిల్..
- Advertisment -