Monkeay Plauaged: యాదాద్రి: కోతుల బెడద యాదాద్రి జిల్లా కలెక్టరేట్ కు తాకింది. భువనగిరి శివారు పగిడిపల్లిలోని యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ కు నిత్యం వందలాది మంది ఉద్యోగులు, సిబ్బంది, సామాన్యులు వస్తూ పోతుంటారు. పట్టణ శివారులోని జిల్లా కలెక్టరేట్ వద్ద కోతులు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో కలెక్టరేట్ సిబ్బంది ఉద్యోగులు, అక్కడికి వచ్చే సామాన్యులు కోతులతో భయాందోళన చెందుతున్నారు. కార్యాలయంలో లోపలికి వెళ్లాలన్నా.. బయటకు రావాలన్న ఉద్యోగులు సిబ్బంది జంకుతున్నారు. మహిళా ఉద్యోగులు అయితే కోతులను చూసి తమ కార్యాలయాల తలుపులను మూసివేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని వరండాలో కోతులు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఎవరి చేతిలో ఏదైనా కనిపిస్తే చాలు మాయం చేస్తున్నాయి. దీంతో కార్యాలయ సిబ్బంది చేతి కర్ర ఉంటేనే బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులు, సిబ్బంది కర్రలు చేత పట్టుకుని కోతులను తరుముతున్నారు. కలెక్టరేట్ వద్ద కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టరేట్ అధికారులను ఉద్యోగులు, సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామాల్లోని కోతుల బెడద ఉందని చెబితే పట్టని అధికారులు ఇప్పుడు కార్యాలయాలకు తాకడంతో ఆందోళన చెందుతున్లునారని సామాన్యులు అంటున్నారు.
Monkeay Plauaged: కలెక్టరేట్ కు కోతుల బెడద.. కర్రలతో పనిచేస్తున్న సిబ్బంది..
- Advertisment -
