హైదరాబాద్ :
సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మెగాస్టార్ చిరంజీవి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి..తన వంతు రూ. 50 లక్షల విరాళంతో పాటు రామ్‌చరణ్ తరుపున మరో రూ. 50 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిరంజీవిని శాలువాతో సత్కరించారు. కాగా..సీఎం రిలీఫ్ ఫండ్‌కు పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. అమర్ రాజా గ్రూప్ తరపున సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళాన్ని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అందజేయగా, సినీ నటుడు అలీ రూ. 3 లక్షలు, విశ్వక్ సేన్ రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు.
సీఎం రేవంత్‌తో మెగాస్టార్..

- Advertisment -