హైదరాబాద్, జనత న్యూస్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. మే 12వ తేదీ శనివారం సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నా ఆయన ఇప్పుడు రిలాక్స్ అయ్యారు. స్టూడెంట్స్ తో కలిసి ఫుట్బాల్ ఆడిన సీఎం కాసేపు విద్యార్థులతో గడిపారు. గేమ్ మధ్యలో షూ పాడైపోతే.. షూ లేకుండానే ఫుట్బాల్ ఆడారు. ముఖ్యమంత్రితోపాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి నేతలు గేమ్ ఆడారు.
ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి
- Advertisment -