గతంలో కారాలు మిరియాలు నూరి తొడలు కొట్టిన శపదం చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి నేడు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబును కలసి శుభ లేఖ ఇచ్చిన ఎమ్మెల్యే మల్లారెడ్డి..నేడు తెలంగాణ సీఎం రేవంత్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలసి తన మనుమరాలి పెల్లి పత్రికను అందజేశారు. వివాహ వేడుకకు రావాలని ఆహ్వానించారు మల్లారెడ్డి. అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డిపై వొంటికాలిపై లేకి ఘాటు విమర్శలు చేసే మల్లన్న సీఎం అయ్యాక మెత్తబడ్డారు. గతంలో ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మనుమరాలి వివాహ వేడుకకు సీఎంను ఆహ్వానించడం విశేషం.
సీఎం రేవంత్ రెడ్డిని కలసిన మాజీ మంత్రి మల్లారెడ్డి

- Advertisment -