CM KCR : సిద్ధిపేట, జనతా న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఈ ఆలయానికి చేరుకోగా మంత్రి హరీష్ రావు ఘన స్వాగతం పలిగకారు. అర్చకులు మంగళ వాయిద్యాలతో స్వాగతించారు. ఈ నెల 9న గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు.

అదేరోజుల బీఆర్ఎస్ ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. సిద్ధిపేట జిల్లాలోని కోనాయిపల్లి వేంకటేశ్వర ఆలయం కేసీఆర్ కు సెంటిమెంట్ గా నిలిచింది. ఏ ఎన్నికలు జరిగినా ఆయన మొదట ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. 1985లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఈ ఆలయంలో ముందుగా పూజలు నిర్వహించిన తరువాతే నామినేషన్ వేస్తారు. 2001లో టీఆర్ఎస్ పార్టీని ప్రకటించే ముందు కూడా ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు. అయితే ఈసారి కేసీఆర్ హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సందర్భంగా మరోసారి తన గెలుపుకు సహకరించాలని స్వామివారిని వేడుకున్నారు.